Saturday, 9 December 2017

whatsapp



                 ఇద్దరు స్నేహితులు ఒక పెద్ద కంపెనీలో తొమ్మిది సంవత్సరాలుగా  పని చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని, తమను తాము నిరూపించుకోవటానికి,ఏదో సాదించటానికి, ఈ సమాజములో ఒక గుర్తింపు కోసం బయటకు  వచ్చేసారు. బయటకు వచ్చిన తరువాతే  వారికి అసలు కష్టాలు ఎదురయ్యాయి. అందుకు నిరాశ, నిస్పృహలు కూడా తోడయ్యాయి. జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని ఎదుర్కొని నిలబడ్డారు. తమలో ఉన్న ఒక ఆలోచనకు రూపం ఇవ్వటానికి రాత్రి పగలు కష్టపడ్డారు. చివరికి కష్టాల కడలిని దాటి, విజయ తీరాలను చేరుకొని, గెలుపు జెండాను ఎగురవేశారు
 
Brian acton & jan  koum
                          ఆ స్నేహితులే జాన్ కౌ మరియు బ్రియాన్ యాక్టన్. వారు సృష్టించిన ఆ యాప్ వాట్సాప్. కమ్యూనికేషన్ రంగం లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది వాట్సాప్.  అప్పటికే సునామీలా దూసుకొస్తున్న పేస్ బుక్ ఒరవడిని తట్టుకొని తన సత్తా చాటుకొంది వాట్సాప్. జాన్ ను మరియు బ్రియాన్ ను విజేతలుగా నిలబెట్టింది. ఆ స్నేహితులు పడిన కష్టాలే ఈనాటి మన

జాన్ గురించి :
                             ఉక్రెయిన్ లో నిరుపేద కుటుంబం లో పుట్టిన జాన్ చిన్నప్పుడే ఎన్నో కష్టాలను  ఎదుర్కొన్నాడు. తాను ఉంటున్న ఇంట్లో కనీస సదుపాయాలు కూడా ఉండేవి కావు. పదహారు సంవత్సరాల వయసులోనే తన తల్లి తో పాటు తాను కన్న కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ఉక్రెయిన్ నుంచి అమెరికా కు వలస వచ్చాడు జాన్. రోజు ఖర్చులకు డబ్బులు కూడా లేని స్థితిలో అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ స్టాంపుల కోసం వేచిచూడ వలసి వచ్చింది. ఆ కష్టాలను ఎదుర్కోవటానికి పదహారేళ్లకే ఒక గ్రోసరీ  స్టోర్ లో క్లీనర్ గా పనిచేయవలసివచ్చింది. ఆ సమయం లోనే తన తల్లికి కాన్సర్ అన్న విషయం తనను మరింత వేదనకు గురి చేసింది.

                              ఆ తరువాత కంప్యూటర్ ల పైన, ప్రోగ్రామింగ్ పైన ఇష్టాన్ని పెంచుకున్న జాన్, వాటి పై పట్టు సాధించటం మొదలు పెట్టాడు. ప్రోగ్రామింగ్ పుస్తకాలను అద్దెకు తెచ్చుకొని చదువుకునేవాడు. ఆ ఇష్టమే తనను సాంటోస్ స్టేట్ యూనివర్సిటీ వరకు కు వెళ్లగలిగేలా చేసింది. అయితే యూనివర్సిటీ చదువును మధ్యలోనే  ఆపేసి ,యాహు కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాడు జాన్. అక్కడే జాన్ కు బ్రియాన్ ఆక్టన్ పరిచయం అయ్యాడు. జీవితం  సంతోషంగా సాగిపోతున్న తరుణంలో తన తల్లి మరణం జాన్ ను ఒంటరి వాడిని చేసింది. ఆ సమయయంలో బ్రియాన్ యాక్టన్ తనకు అండగా నిలబడ్డాడు.

వాట్సాప్ కు రూపం:

                     ఏదో సాధించాలన్న కసి తో, ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని కొత్త ఆలోచనలో పడ్డారు మిత్రులు. అప్పుడే ఒక కొత్త ఐ ఫోన్ కొన్న జాన్, అందులో ఉన్న యాప్ స్టోర్ పాతది కావటం తో ఆపిల్ కంపెనీ వారు, కొత్త యాప్ స్టోర్ ను విడుదల చేయాలని అనుకుంటారు. ఈ సంఘటనే జాన్ లో కొత్త ఆలోచనకు ప్రాణం పోసింది. భవిష్యత్ లో యాప్ లకు  మంచి డిమాండ్ ఉందని గ్రహించాడు జాన్. వెంటనే ఒక కొత్త మెస్సేజింగ్ యాప్ తయారుచేయాలని  అనుకున్న జాన్, ఆ ఆలోచనను బ్రియాన్ ఆక్టన్ తో పంచుకొని దానికి వాట్సాప్ అని పేరు పెట్టాడు. ఆ విధంగా  2009వ సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తేదీన వాట్సాప్ జీవం పోసుకుంది. అయితే వాట్సాప్ ను స్టార్ట్ చేసిన మొదటి రోజుల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసివచ్చింది. తొలి నాళ్ళల్లో వాట్సాప్ ఎక్కువగా సృక్ అవుతూండేది.దీనిని ఎదుర్కోవటానికి జాన్ ఎంతో  శ్రమించవలసి వచ్చింది.  ఒకానొక తరుణంలో వాట్సాప్ పై ఉన్న ఆశలన్ని వదిలేసుకొన్నాడు జాన్. బ్రియాన్ ఇచ్చిన స్ఫూర్తి తో తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు జాన్.

                      ఎప్పటికప్పుడు కొత్త కొత్త  ఫీచర్స్ తో విడుదలవుతున్న వాట్సాప్, యూజర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోయింది.అప్పటికే సునామీలా దూసుకొస్తున్న ఫేస్ బుక్ ఒరవడిని తట్టుకొని తన సత్తా చాటుకొంది వాట్సాప్.
కమ్యూనికేషన్ రంగంలో పెను సంచలనాన్ని సృష్టించి,నేడు కొన్ని కోట్ల మంది మనసులను కొల్లగొట్టింది వాట్సాప్.

                    అయితే 2014 వ సంవత్సరంలో వాట్సాప్ ఊహించని స్థాయికి వెళ్ళింది. వాట్సాప్ కంపెనీను ఫేస్ బుక్ దాదాపు 19 బిలియన్ డాలర్లు అంటే లక్షా 20 వేల కోట్ల రూపాయలు చెల్లించి తన సొంతం చేసుకొంది. అలాగే జాన్ కు  ఫేస్ బుక్ లో బోర్డు మెంబర్ షిప్ కూడ లభించింది. ఈ కార్యక్రమాన్ని మొత్తమ్ సిలికాన్ వ్యాలీలో ఒక చిన్న బిల్డింగ్ లో పూర్తి చేసాడు జాన్. ఒకప్పుడు అక్కడే తన తల్లితో పాటు ఫుడ్ స్టాంపుల కోసం నిలబడ్డాడు. అదే చోట లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు.

వాట్సాప్ గురించి మరికొన్ని విశేషాలు:
➤ వాట్సాప్ ను ప్రమోట్ చేసుకోవటానికి ఏనాడూ ఒక్క డాలర్ కూడా ఖర్చుపెట్టలేదు.

➤ బ్రియాన్ యాక్టన్ ఫేస్ బుక్ లో జాబ్ కోసం అప్లై చేసుకోగా , బ్రియాన్ ను ఆ కంపెనీ తిరస్కరించింది.


➤ మన భారత దేశం వాట్సాప్ కు ఎక్కువగా యూజర్లు ఉన్న దేశం.దాదాపు 20 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది.

➤ ఇప్పటికి వాట్సాప్ లో కేవలం 55మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు.

➤ ఇప్పుడు వాట్సాప్ కు దాదాపు నెలకు 450 మిలియన్ల యాక్టీవ్ యూజర్లు ఉన్నారు.

➤ వాట్సాప్  ద్వారా ఒక రోజుకు 5వేల 5 వందల కోట్ల మెసేజ్ లు పంపబడుతున్నాయి.

➤ ఒక యూజర్ సగటున నెలకు వాట్సాప్ ద్వారా 1000 మెసేజ్ లు పంపుతున్నాడు.

➤ ఒక రోజులో వాట్సాప్ ద్వారా దాదాపు 450 కోట్ల ఫోటోలు  షేర్ అవుతున్నాయి.

➤ ఒక రోజులో వాట్సాప్ ద్వారా దాదాపు వంద కోట్ల వీడియోలు  షేర్ అవుతున్నాయి.

➤ ప్రతి రోజు పది లక్షల మంది కొత్తగా వాట్సాప్ లో రిజిస్టర్ అవుతున్నారు.

➤ చైనా ,ఇరాన్ లలో వాట్సాప్ ను బ్లాక్ చేయటం జరిగింది.

             
                  గుర్తుపెట్టుకోండి
                            నాడు  అమెరికా రోడ్ల మీద అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. తనను తాను నిరూపించుకోవటానికి రాత్రి,పగలూ కష్టపడ్డాడు. నేడు అదే అమెరికాలో బిల్లియనీర్లలలో  ఒకడిగా నిలబడ్డాడు జాన్.కాలం తనను ఒంటరివాడిని చేసినా,జీవితంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం నుండి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకొన్నాడు జాన్. తాను కన్న కలలకు, ఊహించిన ఊహలకు రూపు ఇవ్వటం కోసం రాత్రి, పగలు కష్టపడ్డాడు.నిరాశ, నిస్పృహలు తన వెంటే ఉండి తనను వెక్కిరించినా,విజయ తీరాలను చేరుకోవాలనే తన పట్టుదల,చెక్కు చెక్కుచెదరని తన ఆత్మ విశ్వాసం , తనను ఈ రోజు లక్షల కోట్లకు అధిపతిని చేసింది. కొన్ని కోట్ల మంది యువతకు స్ఫూర్తి ప్రదాతను చేసింది.                           
                 
                           తమకు అవకాశాలు రావని,తమలో నైపుణ్యాలు లేవని, జీవితంలో ఏదయినా సాదించకపోవటానికి కారణాలుగా చెప్పే నేటి యువతకు జాన్ జీవితం కొంతయినా స్ఫూర్తిని ఇవ్వదా?   

                                                                      ఆలోచించండి.   
                                                                              ఒక్కసారి ఆలోచించండి.                                                                
                                                                          by
                                                                             
                                         G. Ravindra Nath Tagore
                                             TELUGUINSPIRE.BLOGSPOT.IN
         
                               
                                                                               

                          
                   
                    




















1 comment:
Write comments

Follow on FaceBook