పాప్ సంగీత ప్రపంచంలో అతను ఓ రాజు, కాదు కాదు రారాజు. కోట్లాది మంది సంగీత ప్రియులకు అతను దేవుడు. తన ఆటతో, తన పాటతో, సంగీత ప్రియులను ఉర్రుతలూగించాడు. పాప్ సంగీత ప్రపంచంలో నాలుగు దశాబ్దాల పాటు ఎదురు లేని మహా శిఖరంగా నిలిచి, కింగ్ ఆఫ్ పాప్ గా జనం చేత జేజేలు అందుకున్నాడు. ఎంత సాధించినా అతని జీవితం చిత్ర విచిత్ర పయనం. జీవితంలో అన్నింటినీ సాధించి, చివరికి తనకంటూ ఏమి లేకుండా, అన్నీ కోల్పోయాడు. తాను నమ్మిన వాళ్లే తన జీవితానికి మరణ శాసనం రాసారు. తనతో కాలం ఆడుకున్న ఆటలో తాను ఓడిపోక తప్పలేదు. చివరికి చరిత్రలో, గెలిచి, ఓడిన వ్యక్తిగా నిలిచిపోయాడు. అతనే మైఖేల్ జాక్సన్.
➤ మైఖేల్ జాక్సన్ బాల్యం:
➤ మైఖేల్ జాక్సన్ బాల్యం:
అమెరికాలో ఓ నిరుపేద నల్ల జాతి కుటుంబంలో 1958 అగస్ట్ 29 న జన్మించాడు మైకేల్. తొమ్మిది మంది సంతానంలో ఏడవవాడు మైఖేల్. తన తండ్రి జోసెఫ్ జాక్సన్ జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్నాడు. అవేవి సాధించక చివరికి తన అసహాయతను, తన కోపాన్ని తన పిల్లలపై చూపించేవాడు. వారికి తనే స్వయంగా సంగీత శిక్షణనిచ్చేవాడు. ఏ చిన్న తప్పు చేసిన వారికి నరకాన్ని చూపించేవాడు.చిన్న వయసులోనే తన తండ్రి వల్ల ఎన్నో చిత్ర హింసలకు గురయ్యాడు. ఐదేళ్ల వయసులోనే మైఖేల్ తన సోదరులతో కలిసి అమెరికా రోడ్ల మీద సంగీత ప్రదర్శనలిచ్చేవాడు. అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించారు.
➤ పాప్ స్టార్ గా మైఖేల్ :
➤ పాప్ స్టార్ గా మైఖేల్ :
ఆ తరువాత మైఖేల్ సొంత గుర్తింపు కోసం, సొంతంగా ప్రదర్శనలివ్వటం మొదలు పెట్టాడు. తాను విడుదల చేసిన Off the wall, Music and me, Ben వంటి ఆల్బమ్ లు తనను ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగేలా చేసాయి.తాను విడుదల చేసిన ఆల్బమ్ లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మైఖేల్ విడుదల చేసిన Thriller ఆల్బమ్ అప్పట్లో పెను సంచలనాన్నే సృష్టించింది. అప్పటివరకు ఉన్న రికార్డు లను కొల్లగొట్టి, బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ గా కొత్త రికార్డులను సృష్టించింది. అంతే కాదు ఏకంగా ఏడు గ్రామీ అవార్డులను గెలుచుకుంది.1983 లో ఒక ప్రదర్శనలో తాను వేసిన మూన్ వాక్ స్టెప్ తో జనులందరిని ఆశ్యర్యంలో ముంచెత్తాడు. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డులు తన ప్రతిభకు దాసోహం అయ్యాయి. ఏకంగా 13 గ్రామీ అవార్డులు, 39 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు, 16 వరల్డ్ మ్యూజిక్ అవార్డులతో మైఖేల్ జాక్సన్ సంగీత ప్రపంచంలో తనకు తిరుగులేదనిపించుకున్నాడు.
➤ ముఖానికి ఎన్నో సర్జరీలు :
1981 నుంచి మైఖేల్ జాక్సన్ రూపు మారటం మొదలైనది. ఒక రకమైన మచ్చలతో శరీరం రూపు కోల్పోవటం తో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. 1979 లో ఒక ప్రదర్శనలో డాన్స్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు కిందకు పడటంతో తన ముక్కు కు గాయం అవటంతో, ఊపిరి కూడా పీల్చుకుపోలేని స్థితిలో ముక్కు కు సర్జరీ చేయించుకోక తప్పలేదు. 1984 లో స్టేజ్ మీద డాన్స్ చేస్తుండగా, చుట్టు పక్కల ఉన్న బాణాసంచా ఒక్క సారిగా పేలటం తో, ఆ మంటలు మైఖేల్ జాక్సన్ తలకు అంటుకోవటంతో , జుట్టు పూర్తిగా కాలిపోయి, తలకు గాయాలు అయ్యాయి. ఇందుకోసం మరొక్కసారి సర్జరీ చేయించుకున్నాడు. ఇలా రకరకాల సర్జరీలతో మైఖేల్ శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనను అనుభవించాడు.
పిల్లల మీద తనకున్న ఇష్టంతో కాలిఫోర్నియాలో 200 ఎకరాలలో పిల్లలు సరదాగా గడపటానికి Never Land అనే పేరు తో ఓ నిర్మాణాన్ని నిర్మించాడు మైఖేల్.
➤ జీవితంలో ఎన్నో వివాదాలు :
కష్టాలు ఎవరికి అతీతం కావు. కాలం ఎవరికి అనుకూలం కాదు. మైఖేల్ జాక్సన్ జీవితానికి ఇది సరిగ్గా సరిపోతుంది. చిన్న పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు రావటంతో రెండు సార్లు కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఎంతో డబ్బును పోగొట్టుకోవలసి వచ్చింది. చివరికి కోర్టు మైఖేల్ జాక్సన్ ను నిర్దోషిగా ప్రకటించినా అప్పటికే జరగవలసింది జరిగిపోయింది. ఒక వైపు తన వ్యక్తిగత ఖర్చులు, Never Land ఖర్చులు పెరిగిపోవటంతో మైఖేల్ అప్పుల్లో కూరుకుపోయాడు. తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న Never Landను కూడా అమ్మవలసి వచ్చింది. రెండు సార్లు పెళ్లి చేసుకున్నప్పటికి, అవి సఫలం కాలేదు. ఇలా రకరకాల కారణాలతో మైఖేల్ ఒంటరిగా గడిపేవాడు. సెలబ్రిటీ హోదాను అనుభవించలేకపోయాడు. మనుషులపై భయాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నాడు. అనేక ఆరోగ్య సమస్యలు తన శరీరాన్ని వ్యధకు గురిచేశాయి. శారీరక, మానసిక బాధలతో మైఖేల్ జాక్సన్ 2009 జూన్ 25 న ఈ లోకాన్ని వీడిపోవలసి వచ్చింది. ఈ నాడు మైకేల్ జాక్సన్ మన మధ్య లేకపోయినా, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో అతను ఎప్పటికీ చిరంజీవే.
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మైఖేల్ జాక్సన్ Propofol అనే మత్తు మందును తీసుకోవటం వల్లనే చనిపోయాడని నిర్దారించారు. దీనిని తన పర్సనల్ డాక్టర్ ముర్రే సలహా వలనే మైఖేల్ వాడాడని తెలిసింది. మైఖేల్ మరణానికి పరోక్షంగా కారణమైన డాక్టర్ ముర్రేకు కోర్టు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.
అమెరికా రోడ్ల మీద సంగీత ప్రదర్శనలిచ్చే స్థాయి నుండి, అదే అమెరికాలో తిరుగులేని పాప్ స్టార్ గా ఎదిగాడు మైఖేల్. జాత్యహంకారం తో ఊగిపోతున్న అమెరికన్లను, తన స్టెప్పులతో మైకంలో ముంచాడు. తన ప్రతిభ తో ఎంత వేగంగా అయితే ఎదగగలిగాడో, అంతే వేగంగా పాతాళాన్ని చేరుకున్నాడు. తాను ఎంతో సాధించినప్పటికీ, చివరి రోజుల్లో తాను అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతం. కాలం తనతో ఆడుకున్న ఆటలో తాను ఓడిపోక తప్పలేదు. చివరి రోజుల్లో తనకంటూ ఏమి మిగలలేదు ఒక్క తన కష్టాలు తప్ప. అందుకే యాభై ఏళ్ళలో తాను సాగించిన జీవితం, చిత్ర విచిత్రాల పయనం. ఏది ఏమైనప్పటికి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి, కోట్లాది మంది సంగీత ప్రియుల మనసులు గెలవటమే కాదు, కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచాడు మైఖేల్ జాక్సన్.

No comments:
Write comments