Sunday, 15 July 2018

 పుట్టిన వాడు మరణించక తప్పదు. మరణించిన వాడు పుట్టక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. మనుషులందరికి పుట్టుకను  ఒకే విదంగా ప్రసాదించిన దేవుడు  మరణానికి  మాత్రం ఎన్నో మార్గాలను సృష్టించాడు.  ఎంతటి మహాఘనులైనా ,  గొప్పవారైనా  ఏదో ఒక     రోజు ఖచ్చితంగా అందరు  మృత్యు దేవతను కుగిలించుకోవాల్సిన వారే.
కొందరి మరణాల గురుంచి వింటే ఆశ్చర్యమేస్తుంది . మరికొనాద్రి మరణాల గురుంచి వింటే నవ్వు వస్తుంది. ఇంకొందర్వి భయానకరంగా ఉన్నాయి. ఈ భూమి మీద మనిషి బ్రతకాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి. ఆలా తిన్నందుకు , ఆ తిన్నది అరగనందుకు , ఏకంగా ఒక రాజే చనిపోయాడు. షూటింగ్ లో చనిపోయినట్టు నటించమంటే , ఏకంగా నిజంగానే చనిపోయారు ఒకరు,  , తలలోకి బులెట్ దిగితే, చనిపోవటానికి ఒక్క క్షణం చాలు, కానీ, ఏకంగా తలలో బులెట్ దిగినా 67 రోజులు  చనిపోని ఒక వ్యక్తి , చివరికి తలనొప్పితో చనిపోయాడు. మనం ఆకలితో చనిపోయిన వారి గురుంచి వినే ఉంటాం, కానీ తన భార్య వండి పెట్టలేదని తినకుండా  ఆకలితో చనిపోయారు ఒకరు. నవ్వే వాడు భోగి, నవ్వని వాడు రోగి, అన్నారు పెద్దలు. అతిగా నవ్వినందుకు  ఆ నవ్వే ఒకరు ప్రాణాలు తీసింది.  కొంతమంది రోడ్ల మీదికి వచ్చి డాన్స్ చేసారు. ఆలా కొన్ని గంటలు, రోజులు, వారాలు, నెలల పటు చేసి చివరికి చనిపోయారు.ఆమె చనిపోయింది అని అందరు అనుకున్నారు. శవాన్ని స్మశానానికి తీసుకువెళ్లారు. కానీ అక్కడ ఆమె బతికింది , కానీ కొద్దీ సేపే, మల్లి ఆమె చనిపోయింది. ఎలా ..? ఆ తరువాత ఇటువంటి ఎన్నో వింత మరణాల గురుంచి తెలుసుకునే ముందు వెల్కమ్ to the tagore world .


1. 1771 లో స్వీడన్ కు చెందిన అడాల్ఫ్ ఫెడ్రిక్ , ఒక రోజు 14 రకాల వంటలున్న ఒక రాజ భోజనాన్ని ఆరగించాడు. వాటితో పాటువేడి పలు, రకరకాల డిష్ లను కలిపి ఆరగించాడు. ఇంకేముంది, ఆ తరువాత తాను తిన్నది  ఆరగక ఆ రాజు ఆపసోపాలు పడ్డాడు.ఎంత ప్రయత్నిచిన తాను తిన్న భోజన్నని మాత్రం జీర్ణం చేసుకోలేకపోయాడు. ఆ వెంటనే అతను చనిపోయాడు. అందుకే మితంగా తినమని పెద్దలు చెప్పిన మాటని వినాలి లేకపోతే ఇలానే జరుగుతుంది. మీరు కూడా జాగ్రత్త.
2. బ్రూస్ లీ తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ తో ఏకంగా ప్రపంచాన్నే ఉర్రుతలూగించాడు. కానీ అతని మరణం నేటికీ ఒక మిస్టరీని. బ్రూస్ లీ కుమారుడు అయిన  బ్రాండన్ లీ మరణం కూడా ఒక రకంగా విషాదాంతమే. కెమెరా ముందు నటించమని డైరెక్టర్  చెబితే , విధి మాత్రం అతనిని  ఆ సన్నివేశం లో జీవించేసేలా చేసింది. .the crow అనే సినిమా షూటింగ్ లో ,బ్రాండన్ లీ ని మైకేల్ మాస్ , బులెట్ తో కాల్చే సీన్. మాములుగా ఇటువంటి సీన్ లలో ఒరిజినల్ గన్ లను అస్సలు వాడారు. కానీ బ్రాండన్ లీ దురదృష్టం వలన ఆ రోజు నిజమైన గన్ వాడాల్సి వచ్చింది.  బులెట్ నేరుగా బ్రాండన్ లీ పొత్తి కడుపులోకి దూసుకెళ్లింది. వెంటనే అతను నొప్పితో కింద పడిపోయాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అది యాక్టింగె  అనుకున్నారు.

3. బులెట్ బాడీ లోకి వెళ్తేనే మనిషి బతకటం కటం. ఇక తలలోకి వెళ్తే క్షణాలు చాలు , మనిషి ఊపిరి ఆగిపోవటానికి. కానీ , మీ ఊహకు కూడా అందని ఒక సంఘటన జరిగింది.
1877 లో జరిగిన సంఘటన ఇది . టామ్ స్మిత్ అనే ఒక వ్యక్తి అకస్మాత్తుగా సెలూన్ షాప్ లోకి వచ్చి, అక్కడున్న వారిని గన్ తో బెదిరించాడు. అదే సెలూన్ షాప్ లో ఉన్న can steplaton అతనిని అడ్డుకునే ప్రయత్నంలో , టామ్ రివాల్వర్ నుండి వచ్చిన ఒక బులెట్ పక్కనే ఉన్న డేవిడ్ తలలోకి నేరుగా దూసుకెళ్లింది. కానీ అతనికి ఏమి కాలేదు. ఆరోగ్యంగా ఉన్నాడు. 67 రోజుల తన పనులు తాను చేసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా గడిపాడు. కానీ 68 వ రోజు తీవ్రమైన తల నొప్పి తో డేవిడ్ మరణించాడు. కానీ డాక్టర్లకు అంతు చిక్కని ప్రశ్న , అన్ని రోజులు అతని తలలో బులెట్ ఉన్న ఎలా బతకగలిగాడు.

4. ఒక వస్తువు ఎంత గట్టిగా ఉందో తెలుసుకోవటానికి , కొందరు కొన్ని పరీక్షలు చేస్తారు. కానీ ఒకతను మాత్రం కిటికీ కి ఉన్న గ్లాస్ గట్టిదని నిరూపించటం కోసం , తన ప్రాణాలను కోల్పోవల్సివచ్చింది. 1993 లో గారి హొయ్ అనే ఒక వ్యక్తి , 24 వ ఫ్లోర్ లో ఉన్న చిన్న గదిలో ఉన్నతన  కిటికీ కి ఉన్న గ్లాస్ ఎంతో గట్టిదని , అక్కడున్న విజిటర్స్   నిరూపించటం కోసం , ఆ వ్యక్తి, వేగంగా వెళ్ళి, ఆ కిటికీ ని ఢీకొన్నాడు, కానీ ఆ గ్లాస్ పగలలేదు , ఊడిపోయింది. ఇంకేముంది 24 వ ఫ్లోర్ నుండి పది చనిపోయాడు.

5. ఆకలితో చనిపోయిన వారి గురుంచి, బహుశ అందరు వైన్ ఉంటారు, కానీ తన భార్య వండి పెట్టలేదని , ఆకలితో చనిపోయిన వ్యక్తి గురుంచి మీరు తప్పక తెలుసుకోవాలి.
అతని పేరు kurt godel ,  గణిత శాస్త్రవేత్త . ఎవరైనా తాను తినే ఆహరం లో విషం కలిపి చంపేస్తారేమో అనే భయం బతికేవాడు. అందుకే ఇతను కేవలం తన భార్య వండి పెట్టిన ఆహారాన్ని మాత్రమే తినేవాడు.కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా..తన  భార్య అనారోగ్యం తో 6 నెలలు పాటు  హాస్పిటల్ లో  ఉండటం తో , తాను వంట చేయలేకపోయింది. kurt తన భయం వాళ్ళ ఏ ఆహరం తీసుకోలేదు , చివరికి చనిపోయాడు , కానీ ప్రాణం పోతున్నప్పుడు కూడా అతను వేరే ఆహారం మాత్రం తీసుకోలేదు. చనిపోయినపుడు అతని బరువు కేవలం 29 కేజీలే.

6. నవ్వుతూ బతకాలిరా అని అన్నాడు  అన్నాడు ఓ మహా కవి. కానీ ఓ నవ్వు ఒక గొప్ప పిలాసపర్  ప్రాణం తీసింది.
7. రష్యా కు చెందిన fagilyu Mukhametzyanov కు ఒక రోజు తీవ్రమైన ఛాతి నొప్పి తో ఆమె చనిపోయింది. డాక్టర్ లు కూడా ఆమె మరణాన్ని నిర్దారించారు. ఇక బంధువులందరూ కూడా బరువెక్కిన గుండెలతో, ఆమె శవాన్ని స్మశానానికి తీసుకువచ్చారు. ఆమె శవాన్ని శవపేటికలో ఉంచి, ఆమె ఆత్మ కు శాంతి కలగాలని , అక్కడున్న వారందరు, ప్రార్థనలు చేయటం మొదలు పెట్టారు. సడన్ గా శవపేటికలో యేవో కదలికలు, ఏమైందో అని గమనించేలోపల ఆ శవపేటిక నుండి ఆమె లేచింది. ఇదంతా చూస్తున్న వారు నిచ్చేష్టులయ్యారు. చుట్టూ ఉన్న ఆ వాతావరణాన్ని చూసి ఆమె కూడా షాక్ అయ్యింది. ఇక్కడున్న వారు నేను చనిపోయాను అనుకుని , నా అంతక్రియలకు వచ్చారు అని ఆమె కు అర్థమయింది. అంతే ఆ షాక్ తో ఆమె కు గుండె పోటు  వచ్చి ఆమె అక్కడే చనిపోయింది. నిజానికి ఆమె మొదటి సారి నిజంగా చనిపోలేదు , డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల 



8.  మన కళ్ళ ముందు ఎవరైనా చనిపోతూ ఉంటె, వారిని కాపాడటానికి మనం  శాయశక్తులా ప్రయత్నిస్తాం. అలాంటిది ఒక దేశానికీ చెందిన మహారాణి చనిపోతుంటే, చుట్టూ అనేక మంది ఉన్న ఎవ్వరు ఆమెను కాపాడటానికి  ప్రయత్నించలేదు  ఎందుకు   , అసలు ఏమి జరిగింది, 

థాయిలాండ్ మహారాణి సునంద , ఒక రోజు తన కూతురితో పటు పడవలో ప్రయాణిస్తుండగా , ఆ పడవ ప్రమాదానికి గురయ్యింది.చుట్టూ ఎంతో  మంది నౌకర్లు ఉన్నప్పటికీ  మహారాణి ని  ఎవ్వరు  కాపాడటానికి కూడా ప్రయత్నించలేదు. ఎందుకంటె అక్కడి రాజ్యాంగం ప్రకారం , రాజ కుటుంబీకులను , సామాన్యులు తాకడానికి కూడా వీల్లేదు. 

1 comment:
Write comments

Follow on FaceBook