ఇది నేటి ఆధునిక మానవుడు నివసిస్తున్న 21 వ శతాబ్దం, సామాన్య మానవుడి ఊహకందని టెక్నాలజీ తో శరవేగంగా దూసుకుపోతుంది. ప్రపంచమంతా నేడు కుగ్రామంగా మారిన వేళ, కొత్త కొత్త భావజాలాలతో, నూతన సిద్ధాంతాలతో, సరికొత్త విప్లవాలతో , ఎప్పటికప్పుడు , తనరూపు మార్చుకుంటూ, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేటి మానవుడు కూడా, అనాగరిక భావజాలాలను, పనికిరాని సిద్ధాంతాలను పక్కన పెట్టి, నూతన ప్రపంచం వైపు అడుగులేస్తున్నాడు. కానీ నేటి సమాజం లో అప్పుడపుడు , అక్కడక్కడ జరిగే కొన్ని అనాగరిక , అనైతిక పనులు, చూస్తుంటే అసలు మనం ఇరవై ఒకటవ శతాబ్దపు మనుషులమేనా అని ప్రశ్నించుకోక తప్పదు.
రెండు వందల ఏళ్ళ ఆంగ్లేయుల చీకటి పాలన నుండి, విముక్తి పొందిన భారతీయ
ప్రజలు ఆనాటి నుండి నేటి వరకు తమ సంస్కృతి , సంప్రదాయాలను , ఆచార
వ్యవహారాలను కాపాడుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో మన హిందూ వ్యవస్థకు పుండులా తయారైన కులవ్యవస్థ ఆనతి నుండి నేటి వరకు దాని రూపాన్ని, ఏమాత్రం మార్చుకోలేదు , సరికదా సమాజంలో దాని ప్రాబల్యం పెంచుకుంటూనే ఉంది. ఊహకు అందని అభివృద్ధిని సాధించిన నేటి మానవుడి మస్తిష్కం లో కులమనే పురుగు చేరి, సమాజానికే హానికరంగా మారింది, వీటన్నిటిని చూస్తూ , తమకేమి తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్న మనుషుల నిర్లక్ష్యానికి ప్రతిరూపమే నేటి సమాజంలో తాండవిస్తున్న కుల హత్యలు, పరువు హత్యలు, నిమ్న కులాలపై జరుగుతున్న దాడులు...

Ravi
ReplyDeletewgwg
ReplyDelete