Sunday, 23 December 2018

అందరిలా తాను ఈ ప్రపంచం మారాలి అని అనుకోలేదు, తన మేధస్సుతో ఈ ప్రపంచాన్ని మార్చాలి అని అనుకున్నాడు అందుకే  పదిహేడేళ్ల వయసులో తాను పుట్టిన దక్షిణాఫ్రికా దేశాన్ని వదిలి , తన ఆలోచనలతో ఈ ప్రపంచాన్నీ మార్చటానికి కెనడా దేశానికీ ఒంటరిగా పయనమయ్యాడు. బ్రతకటం కోసం చేతికి అందిన ప్రతి పనిని చేస్తూనే మరో వైపు చదువుకున్నాడు. తన విజ్ఞానాన్ని పెంచుకున్నాడు. నేడు ఈ ప్రపంచ స్వరూపాన్నీ, మానవ జీవన విధానాన్ని మార్చే ఎన్నో ఇన్నోవేషన్ కంపెనీలు అతని సొంతం. అతనే  ఎలాన్ మస్క్, ఈ శతాబ్దపు అతి గొప్ప ENTRAPENUAR , INVENTOR. 

           1971 లో సౌత్ ఆఫ్రికా లో పుట్టిన మస్క్ తన పదేళ్ల వయసులోనే తన తల్లితండ్రులు విడిపోవటంతో తన తండ్రి దగ్గరే మస్క్ పెరిగాడు. చిన్నవయసులోనే మస్క్ కు కంప్యూటర్ అన్నా, సైన్స్ అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టం తోనే సొంతంగా కంప్యూటర్ కోడింగ్ నేర్చున్నాడు. అలా పన్నెండేళ్ల వయసులోనే BLASTER అనే వీడియో  గేమ్ ను రూపొందించి దానిని 500 డాలర్లకు అమ్మాడు.కానీ తన ఆలోచనలు తనను అంతటితో ఆగిపోనివ్వలేదు. ఏదో చెయ్యాలని ఆరాటం, ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సాహం, అందుకే 17 ఏళ్ళ వయసులో దక్షిణాఫ్రికాను వదిలి కెనడాకు ఒంటరిగా పయనమయ్యాడు. ఒక వైపు  వైపు పార్ట్ టైం జాబులు చేస్తూ మరో వైపు చదువుకున్నాడు. ఆ తరువాత PH.D చేయటం కోసం అమెరికా లోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో చేరాడు. కానీ చేరిన రెండు రోజులకే చదువు ను ఆపేసి యూనివర్సిటీ నుండి బయటకు వచ్చేసాడు.
                           తన అన్నయ్యతో కలిసి జిప్2 అనే ఒక వెబ్ సాఫ్ట్ వేర్ కంపెనీ ని ప్రారంభించాడు. దీని కోసం పగలు, రాత్రి కష్టపడ్డాడు మస్క్.తాను పడిన కష్టం వృధా కాలేదు,  జిప్2 ను 307 మిలియన్ డాలర్లకు ఓ సంస్థ కొనుగోలు చేసింది. తన వాటా కింద మస్క్  కు 22 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ వయసులో మస్క్ కు ఇది భారీ విజయం. కానీ ఈ సారి మస్క్ అంతటితో ఆగలేదు. 10 మిలియన్ డాలర్లతో x.com అనే ఆన్లైన్ పేమెంట్ సంస్థ ను స్థాపించాడు. ఆ తరువాత దీనిని paypal కు అమ్మేశాడు. ఆ ఒప్పందంలో భాగంగా paypal కు సిఇఓ గా పనిచేసాడు. కానీ బోర్డ్ మెంబెర్స్ తో గొడవల కారణంగా మస్క్ paypal నుండి బయటకు వచ్చేసాడు. ఆ తరువాత paypal ను ebay కొనుగోలు చేయటంతో వాటా కింద మస్క్ కు 180 మిలియన్ డాలర్లు అందాయి.

చరిత్రను మార్చే ఇన్నోవేషన్స్:-
       ఈ సారి మస్క్  ఆలోచనలు మార్స్ వైపుకు మళ్ళాయి. అంగారకుడి పై మానవ ఆవాసాన్ని సుసాధ్యం చేయాలనే సంకల్పంతో ఉన్నాడు మస్క్.కానీ మార్స్ పై ప్రయోగాలు చేయాలంటే ముందు రాకెట్ లు కావాలి. ఇందుకోసం మస్క్ రష్యా రాజధాని మాస్కో కు బయల్దేరాడు. అక్కడి ఆయుధ వ్యాపారులను కలిసాడు. ఒక్క రాకెట్ విలువ 8 మిలియన్ డాలర్ లు అని చెప్పటం తో ఈ ధర చాలా ఎక్కువని మస్క్ అభిప్రాపడ్డాడు.ఆ ఆయుధ వ్యాపారులు కొనటానికి డబ్బులు లేవా అని ఎగతాళి చేయటం తో మస్క్ " మీ దగ్గర కొనటం కాదు, మేమే సొంతంగా రాకెట్లను తయారుచేస్తాం  అని చెప్పి అక్కడి నుండి వచ్చేసాడు. అయితే మనసులో ఒకే ఆలోచన ఎలాగైనా సరే మార్స్ కు చేరుకోవాలని.. రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదన్న విషయం మస్క్ కు అర్థమయింది.
                 అలా 2002 లో తన సొంత డబ్బు 100 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి స్పేస్ x అనే కంపెనీ కు జీవం పోసాడు మస్క్.చౌకగా రాకెట్లను తయారు చేయాలన్న సంకల్పంతో పగలు రాత్రి కష్టపడ్డాడు మస్క్.ఏ మాత్రం తేడా వచ్చినా ఒకే సారి వందల కోట్లలో నష్టం చూడాల్సి వస్తుంది. కానీ మస్క్ మాత్రం వెనుకడుగువేయలేదు.
                 పెట్రోల్, డీజిల్ కార్ల వలన పర్యావరణానికి కలిగే హానిని గ్రహించిన మస్క్ మార్కెట్ లోక్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలనుకున్నాడు. అందుకోసం 2003 లో టెస్లా అనే మరో కంపెనీకి ప్రాణం పోసాడు మస్క్.డ్రైవర్ రహిత కార్లను అభివృద్ధి చేయటం కూడా మస్క్  సంకల్పం.
                వృధా అవుతున్న సోలార్ ఎనర్జీ ని వాడుకోవాలనుకున్నాడు మస్క్. అనుకున్నదే తడువు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి మరి 2006 లో సోలార్ సిటీ అనే మరో కంపెనీని స్థాపించాడు మస్క్.


       ఈ మూడు కంపెనీలను అభివృద్ధి చేయటం కోసం మస్క్ వారానికి వంద గంటలకు పైనే  కష్టపడేవాడు,  తన మేధస్సున,  తన దగ్గర ఉన్న మొత్తం డబ్బును పెట్టుబడిగా పెట్టాడు. కానీ ఓటమితో సావాసం చేయనిదే , గెలుపు తీరాలను చేరుకోలేమన్న చేదు నిజం మస్క్ జీవితంలో కూడా  నిరూపితమైంది.
       2006 లో నాలుగేళ్ల పాటు  కష్టపడి రూపొందించిన space x తొలి రాకెట్ లాంచ్ అయిన 33 సెకన్లకే పేలిపోయింది. ఇది చూసి అందరు నవ్వారు. రాకెట్లు పంపించటం అంత తేలికైన విషయం కాదని అందరు మస్క్ ను ఎగతాళి చేసారు.
      ఆ తరువాత tesla నుండి వచ్చిన roadstar అనే అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారును మార్కెట్లోకి తీసుకురావటానికి ఎంతగానో కష్టపడ్డారు. ఎనో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఎంతలా అంటే టెస్లా మూతపడే స్థితికి వచ్చింది. తన దగ్గర ఉన్న మొత్తం డబ్బును tesla లో పెట్టుబడిగా పెట్టాడు మస్క్.
       2007 లో space x నుండి ప్రయోగించిన రెండవ రాకెట్ అంతరిక్షాన్ని దాటి ఆర్బిట్ లోకి ప్రవేశించే సమయంలో రాకెట్ ఇంజిన్ షట్ డౌన్ అవటం తో ఆ ప్రయోగం కూడా విఫలమైంది.
      ఆ తరువాత 2008 లో ప్రయోగించిన మూడవ రాకెట్ కూడా మధ్యలోనే పేలిపోయింది. ఇక మస్క్ దగ్గర కేవలం ఒక రాకెట్ ను ప్రయోగించడానికి సరిపోయేంత డబ్బు మాత్రమే ఉంది.
       సోలార్ సిటీ తో బ్యాంకు లు చేసుకున్న ఒప్పందాన్ని బ్యాంకు లు రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు సోలార్ సిటీని మూసేయాల్సిన పరిస్థితి.
     space x ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్న సమయంలోనే తన పెద్ద కొడుకు మరణం మస్క్ ను ఎంతగానో వేధించింది. ఈ పరిస్థితి నుండి కోలుకోవడానికి మస్క్ కు చాలా కాలం పట్టింది.
       ఎంతో ఇష్టపడి ప్రేమించి  పెళ్లి చేసుకున్న భార్య తో 2008 లో విడాకులు తీసుకున్నాడు మస్క్.

         ఇన్ని దారుణమైన పరిస్థితులు ఎదురైనప్పటికి మస్క్ వాటిని తట్టుకుని నిలబడ్డాడు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. తన మేధస్సుకు మరింతగా పదును పెట్టాడు. పగలు రాత్రి ప్రయోగాలతోనే గడిపాడు మస్క్.
చివరికి
space x నుండి ప్రయోగించిన 4వ  రాకెట్ విజయవంతమైంది. అంతే ఒక్కసారిగా దేశదేశాలలో మస్క్ పేరు మారుమోగిపోయింది. ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్ పంపించటమా అని అందరు ఆశ్చర్యపోయారు. ఈ విజయాన్ని చూసినా నాసా కూడా స్పేస్ స్టేషన్ కు గూడ్స్ డెలివరీ చేయటానికి 1.8 బిలియన్ డాలర్ల తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దెబ్బతో మస్క్ జీవితం పూర్తిగా మారిపోయింది.  ఆ తరువాత టెస్లా మోటార్స్ నుండి వచ్చిన roadstar , మోడల్ స్ , మోడల్ 3 కార్లు మార్కెట్ లో వీరవిహారం చేసాయి. ఆ తరువాత టెస్లా వెనుదిరిగి చూసుకోలేదు. నష్టాలలో కూరుకు పోయిన సొలార్ సిటీ కూడా లాభాల బాట పట్టింది.
        ప్రస్తుతమున్న రవాణా వ్యవస్థతో విసిగిపోయిన మస్క్ 2012 లో హైపర్ లూప్ కు శ్రీకారం చుట్టాడు. గంటకు వందల కిలోమీటర్ల వేగం తో భూమి లోపల నుండి పైపుల ద్వారా  మనుషులను రవాణా చేయటం హైపర్ లూప్ లక్ష్యం. అతిత్వరలో ఈ విధానం మానవులకు అందుబాటులోకి వస్తుంది.
      మనిషి మెదడులో చిప్ లను అమర్చి , తద్వారా మనిషి మెదడు పనితీరును మెరుగుపర్చాలని ఎలాన్ మస్క్ లక్ష్యం. అందుకే neuralink అనే కంపెనీని స్థాపించాడు. ఈ టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే  సరికొత్త మహా విప్లవాన్ని మానవులు చూడక తప్పదు.
       ప్రపంచంలోని ఒక నగరం నుండి మరో నగరానికి గంట వ్యవధిలోనే మనుషులను రాకెట్ల ద్వారా చేరవేసే అద్భుతమైన టెక్నాలజీ ని కూడా మస్క్ అభివృద్ధి పరుస్తున్నాడు.
       టెస్లా మోటార్స్ నుండి డ్రైవర్ రహిత కార్లను విడుదల చేయటానికి కూడా మస్క్ సన్నాహాలు చేస్తున్నాడు.
   ఇవే కాదు బోరింగ్ కంపెనీ , ఓపెన్ ఏఐ వంటి ఎనో ప్రతిష్టాత్మక కంపెనీలు మస్క్ ఆలోచనల నుండి పుట్టినవే.



              తాను ఇంటర్నెట్ లో  పేమెంట్ సిస్టం కావాలి అని అనుకున్నాడు. 
                                      అందుకే అతను paypal ను అభివృద్ధి చేసాడు. 
              తాను  అంతరిక్షంలోకి తక్కువ ఖర్చుతో రాకెట్ లు పంపాలి అని అనుకున్నాడు. 
                                       అందుకే అతను స్పేస్ x ను స్థాపించాడు. 
              తాను అంగారకుడి పైన మానవ ఆవాసాన్ని ఏర్పరచాలి అని అనుకున్నాడు.           
                                       అందుకోసం అతను ప్రయోగాలు చేస్తున్నాడు. 
              తాను ఎలక్ట్రిక్ కార్లను , డ్రైవర్ రహిత కార్లను  మార్కెట్లోకి తీసుకురావాలనుకున్నాడు. 
                                       అందుకే అతను టెస్లా మోటార్స్ ను స్థాపించాడు. 
              తాను సూర్యుడి నుంచి వచ్చే శక్తీ ని వాడుకోవాలి అని అనుకున్నాడు. 
                                        అందుకే అతను సోలార్ సిటీ ని స్థాపించాడు. 
               తాను ఈ ప్రపంచంలో అత్యంత వేగమైన రవాణా వ్యవస్థ కావాలనుకున్నాడు.     
                                        అందుకే అతను హైపర్ లూప్ ని అభివృద్ధి చేస్తున్నాడు. 
            తాను  మనిషి మెదడు పనితీరు మెరుగుపర్చాలి అని అనుకున్నాడు. 
                                         అందుకే అతను neuralink ని స్థాపించాడు. 

 
     మస్క్ ఏ రోజు ఈ ప్రపంచం మారాలి అని అనుకోలేదు. ఈ ప్రపంచాన్ని మార్చాలి అని మాత్రమే అనుకున్నాడు. అందుకే అతను  ఆ పనిలో ఉన్నాడు.


 ఈ సమాజములో ఎవరైతే మార్పు తీసుకురావాలి అని అనుకుంటారో వారికే ఎక్కువగా శతృవులు ఉంటారు. మస్క్ కూడా ఇందుకు అతీతుడు కాదు.

                    ఎలాన్  మస్క్ వచ్చాడు,
                                   ఎలాన్ మస్క్ చూసాడు,
                                              ఎలాన్ మస్క్ ఈ ప్రపంచాన్ని మార్చాడు.
                                                                                    మారుస్తున్నాడు. 
                                            
            

              
       







      
                   
 



























No comments:
Write comments

Follow on FaceBook