మరో ప్రపంచం , మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి.
కదం త్రొక్కుతూ , పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం.?
దారి పొడుగునాయి నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు , బాటలు నడచీ, పేటలు కడచీ , కోటలన్నింటినీ దాటండి, నదీ నదాలు , అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి ?
ఎముకాలు కుళ్ళిన , వయసు మళ్ళిన సోమరులారా చావండి . నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా రారండి !
మరో ప్రపంచం, మహా ప్రపంచం , ధరిత్రి నిండా నిండింది!పడదని ముందుకు , పదండి త్రోసుకు ,ప్రభంజనం వాలే హోరెత్తండీ ,బావ వేగమున ప్రసరించండీ వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె , పెళ పెళ పెళ పెళ విరుచుకు పదండి, పదండి పదండి, ముందుకు. కనపడలేదా మరో ప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని?
నేనొక్కణ్ణే నిల్చిపోతే చంద్ర గాడ్పులు, వాన మబ్బులు, మంచు సొనలు భూమి మీద భుగ్నమౌతాయి! నింగి నుండి తొంగి చూసే రంగు రంగుల చుక్కలన్నీ రాలి , నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి.
నేను సైతం ప్రపంచాబ్జాపు తెల్లరేకై పల్లవస్తాను , నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను , నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను.
కుక్కపిల్లా, అగ్గిపుల్లా సబ్బుబిళ్ళా,
హీనంగా చూడకు దేన్నీ ,
కవితామయమేనోయ్ అన్నీ
రొట్టెముక్కా,అరటి తొక్కా, బల్ల చెక్కా,
నీ వైపే చూస్తూ ఉంటాయి!
తమ లోతు కనుక్కోమంటాయ్
తలుపు గొళ్ళెం, హారతి పళ్లెం , గుర్రపు కళ్లెం
కాదేది కవిత కనర్హం
ఔనౌను శిల్ప మనర్ఘం !
ఉండాలోయ్ కవితావేశం
కానీవోయ్ రస నిర్దేశం దొరకదటోయ్ శోభాలేసం
కళ్ళంటూ ఉంటే చూసీ
వ్రాక్కుంటే వ్రాసీ
ప్రపంచమొక పద్మవ్యూహం , కవిత్వమొక తీరని దాహం !
పుడమి తల్లికి పురుటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి!

No comments:
Write comments