Thursday, 1 November 2018


        
                      గాంధీజీ హైస్కూల్ లో చదువుతున్నరోజులు అవి, అప్పటికే గాంధీజీ కి పెళ్లి కూడా అయ్యింది. ఆ సమయం లోనే గాంధీజీ కి తన అన్నగారి మిత్రుడైన ఒక వ్యక్తి తో పరిచయం అయ్యింది, ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. కానీ ఆ మిత్రుడి చెడు  అలవాట్ల వలన గాంధీ వాళ్ళ అన్నయ్య , అమ్మ ఈ స్నేహాన్ని మానుకోమని చెప్పారు, చివరికి కస్తూరిబా చెప్పినా కూడా వినలేదు, " అతడికి చెడు అలవాట్లు ఉన్న మాట నిజమే, కానీ అతనిలో ఉన్న సుగుణాల గురుంచి మీకు తెలియదు, అతడు నన్ను చెడగొట్టలేదు, నేను అతనిని మంచి దారికి తీసుకువచ్చి , ఉత్తమ వ్యక్తి గా తీర్చిదిద్దటానికే అతనితో స్నేహం చేస్తున్నాను", అని గాంధీజీ వారిని కష్టపడి ఒప్పించాడు , ఈ అనాలోచిత  నిర్ణయం వల్ల  గాంధీజీ తన జీవితంలో కొన్ని  చీకటి రోజులను అనుభవించవలసి వచ్చింది.

                  ఆ వ్యక్తి ఒక రోజు గాంధీ తో మన ఉపాధ్యాయుల్లో చాలా మంది చాటుగా మద్యాన్ని , మాంసాన్ని సేవిస్తున్నారు అని గాంధీజి కి చెప్పాడు , ఇది విన్న గాంధీజీ వింత ఆశ్చ్యరానికి కొంత బాధకు కూడా లోనయ్యాడు. ఆ మిత్రుడు ఇంతటితో ఆగలేదు,  " మనం మాంసం తినము, అందువల్ల మన జాతి బలహీనంగా తయారవుతుంది, తెల్లవాళ్లు మాంసభోజులు , అందువల్లనే వాళ్ళు మనల్ని పరిపాలించగల్గుతున్నారు , నన్ను చూడు , బలశాలిని,వేగంగా పరిగెత్తగలను, ఈ విషయం  నీకు తెలుసు, నేను మాంసాహారిని కావటమే అందుకు కారణం, మాంసాహారులకు  వ్యాధులు రావు, వచ్చినా  తొందరగా మానిపోతాయి. మన ఉపాధ్యాయులు , రాజకోట ప్రముఖులు వెర్రివాళ్ళు కాదు, వాళ్ళు మాంసం ఎందుకు తింటారనుకున్నావు , మాంసం వల్ల  కలిగే ప్రయోజనాలు   వారికి  బాగా తెలుసు, నువ్వు కూడా వారి లాగే మాంసం తిను , ఎంత బలం వస్తుందో..? అని  అలా మాటలతో మెల్లమెల్లగా గాంధీజీ ని  మార్చటం మొదలు పెట్టాడు. 

             చాల సార్లు ఇవే మాటలు ఆ  మిత్రుడు చెప్పటం తో ,గాంధీజీ కూడా ఈ విషయం గురుంచి దీర్ఘంగా ఆలోచించటం మొదలు పెట్టాడు. అతడు చెప్పింది సరైనదేనని గాంధీజీ కూడా భావించాడు, ఎందుకంటె ఆ మిత్రుడు గాంధీజీ కన్నా చాలా బలవంతుడు, ఎంతదూరమైనా రివ్వున పరిగెత్తగలడు, ఎన్ని దెబ్బలు కొట్టిన కిమ్మనడు, పరాక్రమంలో అతనిని మించిన వారు లేరు, అందుకే అతన్ని చూసి గాంధీజీ కూడా ఆశ్చ్యర్యపడేవాడు, అతనిలా బలశాలి కావాలని గాంధీజీ కి కూడా కోరిక కలిగింది. ఎందుకంటె గాంధీజీ ఆ సమయంలో చాల పిరికివాడు, దొంగలన్నా , దయ్యాలన్నా, పాములన్నా చాల భయం, ఈ భయాన్ని దాటి బయటకు రావాలి  అంటే మాంసం తిని బలవంతుడు అవటమే మార్గం  అని గాంధిజీ నమ్మాడు. 
 

               ఇక మాంసభక్షణకు ముహూర్తం నిర్ణయమైంది , కానీ ఈ తతంగమంతా చాల రహస్యంగా జరగాలని గాంధీజి నిర్ణయించుకున్నాడు, ఎందుకంటె గాంధీజీ కుటుంబానిది  వైష్ణవ సంప్రదాయం,వారు మాంసభక్షణకు పూర్తిగా వ్యతిరేకులు. ఈ విషయం వారికి తెలిస్తే వారి గుండెలు బద్దలైపోతాయని గాంధీజీ భయం . 
  నిర్ణయించిన రోజు రానే  వచ్చింది, ఆ సమయంలో గాంధీజీ కళ్ళలో ఒక వైపు తప్పు చేస్తున్నాన్న భయం , మరొకవైపు బలం సంపాదించి , పరాక్రమవంతుడిని కావాలన్నా కోరిక. ఈ ఆలోచనలతోనే గాంధీజీ , తన మిత్రుడు తెచ్చిన మేక మాంసం ని రుచి చూసాడు. కానీ దానిని మింగటం సాధ్యం కాలేదు. అతి కష్టం మీద చివరికి మాంసాన్ని కడుపులోకి నెట్టుకున్నాడు . కానీ గాంధీజీకి ఆ రోజు రాత్రి చాలా కష్టం అయిపొయింది, ఏవేవో పీడ కలలు రాసాగాయి , కడుపులో ఉన్న మేక మే మే అని అరిచినట్టనిపించింది. ఆ రాత్రి గాంధీజీ కి కాళ  రాత్రిలా అయింది.

               ఆ మిత్రుడు గాంధీజీ ని అంతటితో వదలలేదు, ఖరీదైన హోటళ్లకు తీసుకుపోయి, మాంసానికి సంబంధించిన వివిధ రకాల వంటలను గాంధిజీ కి రుచి చూపించటం మొదలు పెట్టాడు. గాంధీజీ కూడా మెల్లగా మాంసపు రుచికి బాగా అలవాటుపడ్డాడు. మాంసపు విందులకు సంబందించి మొత్తం ఖర్చు ఆ మిత్రుడే భరించేవాడు, ప్రతి సారి అంత సొమ్ము ఎలా వచ్చేదో గాంధిజీ కూడా అర్థమయ్యేది కాదు, గాంధీజీ  ని మాంసాహారిగా మార్చాలని, బలిష్ఠుణ్ణి చేయాలని బలమైన కోరిక ఆ మిత్రుడి లో బలంగా ఉండేది. ఇలా ఒక సంవత్సరం పాటు సాగిన ఈ తతంగం , మెల్లమెల్లగా డబ్బులేక తగ్గిపోయింది. 


                 దొంగతనంగా విందులు ఆరగించిన తరువాత గాంధీజీ కి ఆకలి వేసేది కాదు, ఇంటికి వచ్చి ఆకలి లేదని చెప్పేవాడు, కానీ గాంధీ వాళ్ళ అమ్మ అన్నానికి పిలిచేది, ఆకలి లేదంటే కారణం అడిగేది, అప్పుడు గాంధీజి అన్నం అరగలేదు , అందువల్ల ఆకలి లేదు అని అబద్దం చెప్పేవాడు. అమ్మకు అబద్దం చెబుతున్నందుకు గాంధీజీ చాలా కుమిలిపోయేవాడు. తమ బిడ్డలు మాంసాహారులైనారని తెలిస్తే  తమ తల్లితండ్రుల గుండెలు బద్దలయిపోతాయని గాంధీజీ బాధపడేవాడు. 
             కన్న తల్లితండ్రులను, మోసం చేయటం, వారికీ అబద్దాలు చెప్పటం ధర్మం కాదు , ఎలాగైనా మాంసం తినకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు గాంధీజీ.  ఆనాటి నుండి గాంధీజీ మాంసాహారం పై మోహాన్ని పూర్తిగా వదులుకున్నాడు.


                            కానీ కథ ఇంతటితో అయిపోలేదు..,
                                              ఎందుకంటె  గాంధీజీ వదిలింది మాంసాహారాన్ని మాత్రమే, ఆ మిత్రుడి స్నేహాన్ని మాత్రం  ఇంకా వదలలేదు, అసలైన కథ ఇంకా ముందుంది.



 గాంధీజీ కి మాంసాహారాన్ని తినటం నేర్పించిన ఆ మిత్రుడు ఈ సారి, ఏకంగా , వ్యభిచారగృహానికి దారి చుపించాడు. అవును మీరు విన్నది నిజమే....!, చిన్నప్పుడు గాంధీజీ సిగరెట్లను తాగేవాడు వాటి మోసం డబ్బులు దొంగిలించేవాడు, ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసుకున్నాడు,
                అసలు ఎందుకు , ఎప్పుడు , ఎలా..?
                                                       ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురుంచి తెలుసుకోవాలంటే just wait ....  అంతకన్నా ముందు, thetagoretimes.blogspot.comను సబ్ స్క్రైబ్ చేసుకోండి.


                                                                               written by,
            
                                                                                   M.R. Ravindra Nath Tagore

                                                                              మూలం :సత్యశోధన




గమనిక :- 
   ఆ వయసులో గాంధీజీ మాంసాహారాన్ని  తిన్నది కేవలం బలిష్టుడిగా తయారయ్యి , తెల్ల వాళ్ళను జయించాలన్న బలమైన కోరిక తప్ప, మాంసాహారాన్ని  రుచి చూసి, ఆ రుచిని అనుభవించాలన్న కోరిక మాత్రం గాంధీజీ లో లేదు. చిన్నతనం జరిగిన ఈ సంఘటన వల్ల గాంధీజీ ని తప్పుగా అర్థం చేసుకోకండి.

                                            ****comment below****

No comments:
Write comments

Follow on FaceBook