Monday, 17 February 2020

మహా రాతల వారి మహా కవితలు

మనసులోని భావాలే అక్షరరూపాలుగా జీవం  పోసుకుంటూ, ఆలోచనలను కలిగిస్తూ,  కదిలిస్తూ, మనసుకు మనోహరంగా కదిలి వస్తాయి ఈ రాతలు , ఈ మహా రాతలు.


1.  ధనం దాచుకోవటానికి , దోచుకోవటానికే
              కాదు
     దానం చేయటానికి కూడా...
                          - సామి

    

 2.   మానవుడు మలిచిన మనీ, మానవులను మృత్యు మార్గంలోకి మళ్లించింది.
       మిత్రమా మిమ్మల్ని మీరు మనసులో మందలించుకుని మాములు మార్గంలోకి మరలండి.
                                                                                    - సామి



 3.  కడలిలో కొట్టుకుంటూ వచ్చిన కొట్లాట,
      కడలి దాటి కదనరంగంలో కొనసాగి,
      కదనరంగం వీడి నేడు ఉపాధి కోసం ఊరూరూ
                   ఉద్యమిస్తోంది.
     కడుపు కొత్త కనుమరుగవటానికి కదులుతోంది.
                                                   - సామి


             

4.  మనిషి జీవితం ఒక పువ్వు లాంటిది.
     దాని పరిమళం సాయంత్రం వరకే,
     అలాగే మనిషి విలువ కూడా
     ప్రాణం ఉన్నంత వరకే,
     అలంటి జీవితంలో అసూయ,
     కుళ్ళు ఎందుకు.
                - డి. కళ్యాణి





5.  " కష్టపడి(కకృత్తిపడి) కోట్లు కూడబెట్టిన కాటికే వెళ్తావ్,
        కరుణతో కూడబెట్టిన కోట్లు, కొంతమంది కన్నీళ్లు
        కనుమరుగవడానికి దానం చేసినా  కాటికే వెళ్తావ్,
                           కానీ,
        కాటికి తర్వాత కాలు కన్నీటి నరకంలోక లేక కళల స్వర్గానికా
        అనేది నేడు నీవు చేసే క్రియల కలిమితో కూడుకున్నది.
                                              - సామి



మీ మనసును కదిలించటానికి ముందు ముందు ఎన్నో మహా రాతలు మా కలం నుండి ఉద్భవిస్తాయి.

No comments:
Write comments

Follow on FaceBook